![]() |
![]() |
.webp)
జనవరి 22 రామమందిర ప్రతిష్టాపన మహోత్సవానికి ఘడియలు దగ్గరపడుతున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన క్రతువు కోసం అన్ని దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బుల్లితెర హోస్ట్ రష్మీకి ఇళయ దళపతి విజయ్ ఫ్యాన్ కి మధ్య ట్విట్టర్ లో ఘాటైన చర్చ జరిగింది. రష్మీ దేశవ్యాప్తంగా జరుగుతున్న రామమందిర ప్రతిష్టాపన ఈవెంట్స్ అన్నిటినీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ జై సియారాం (jai sreeram ) అని పెట్టింది.
ఈ వీడియోస్ చూసిన ఒక నెటిజన్ "ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి వాటికి అనవసరంగా డబ్బు వేస్ట్ చేయడం అవసరమా ?...నీ ప్రేమను మతం మీద కాదు మనుషుల మీద చూపించు.." అని కామెంట్ పెట్టేసరికి " ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు..నాకైతే దీపావళి తొందరగా వచ్చినట్టుగా ఉంది. ఒక హిందువుగా నేను గర్వపడుతున్నాను..నా దేవాలయాలన్నీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం రామమందిర ప్రతిష్టాపనతో మొదలవబోతోంది. హిందూ మతమే నా జీవన విధానం.. సీతారాముల వనవాసం ఇన్నేళ్లకు ముగింపుకు వచ్చింది..22 న నేను ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాను. నా తోటి హిందువులు కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. హిందువులుగా మనం సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇదే.. ఐనా నేను ప్రతీ దేవుడిని, దేవతని పూజిస్తాను. మావి అనుకున్న వాటిని మేము సాధించుకుంటూనే ఉన్నాం.
ప్రతీ మందిరంతో నా పూర్వీకుల చరిత్ర ముడిపడి ఉంది..మీరు ఎవరినైతే ఆరాధించాలనుకుంటున్నారో అది మీ ఇష్టం..కానీ రామాలయాన్ని కట్టింది ప్రభుత్వ సొమ్ముతో కాదు.. హిందువుల డబ్బుతో..."అని రష్మీ గట్టిగానే చెప్పింది.. మళ్ళీ అదే నెటిజన్ "మీ విగ్రహాలకు దేవాలయాలు కట్టొద్దు, వారి సిద్ధాంతాలను అనుసరించండి చాలు..దీని కోసం హాఫ్ డే లీవ్స్ ఇచ్చి ఇతరుల సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అలా వృధా చేయొద్దు" అని తిరిగి మెసేజ్ పెట్టేసరికి "మేం ఏం చేయాలో మాకు తెలుసు..మీరు చేయాల్సింది మీరు చేయండి..మాది అనుకున్నది ఏదైనా సరే తిరిగి మాకు కావాలి...మీరు నమ్మే దాన్ని మేము నమ్మాల్సిన అవసరం లేదు ...మేము నమ్మేదాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇది మా వేడుక కాబట్టి మీ కామెంట్స్ తో మిగతా వారిని బాధపెట్టొద్దు" అని కౌంటర్ రిప్లై ఇచ్చింది రష్మీ.
![]() |
![]() |